అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

అవగాహన కల్పించాలి

Aug 8 2026 12:23 AM | Updated on Aug 8 2026 12:23 AM

ప్రత్యామ్నాయ పంటలపై

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): వర్షాలు ఆశించిన స్థాయిలో కురవని నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేలా రైతులను చైతన్యపరచాలని, పంట కుంటల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని, ప్రత్యామ్నా య పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ అంకిత్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలంలో పంటల సాగు, వర్షాభావ పరిస్థితులు, సాగునీటి లభ్యత, స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ, కొత్త సామాజిక భద్రతా పెన్షన్ల మంజూరు, వన మహోత్సవం తదితర అంశాలపై శుక్రవారం హైదరాబాద్‌ నుంచి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ అంకిత్‌, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ తదితరులు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్‌ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, పంటల వైవిధ్యీకరణపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 15 నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీని నిర్వహించాలని, అర్హులకు పింఛన్లు అందేలా చూడాలని, వన మహోత్సవంలో నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు.

పంచాయతీ అభివృద్ధిలో ప్రణాళికలు కీలకం

పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు కీలకమని కలెక్టర్‌ అంకిత్‌ అన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరా నికి జిల్లా, మండల పంచాయతీ అభివృద్ధి ప్రణా ళిక రూపకల్పనపై కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యాచరణ సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ప్రతి మండలం రెండు లక్ష్యాలను ప్రాధాన్యత అంశాలుగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. మండల, జిల్లాస్థాయిలో పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, డీపీఓ అనూష, సీపీఓ సునీత, ఉద్యానవన శాఖ అధికారి కిషోర్‌, ఈఈ తిరుమలేష్‌ పాల్గొన్నారు.

హ్యాండ్‌బుక్‌ రూపొందించాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ (డీసీహెచ్‌బీ)ను ప్రామాణికంగా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాలని జనగణన సంచాలకులు భారతి హోళీ కేరి కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి శుక్రవారం ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ అంకిత్‌, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌తో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్ణీత నమూనాలో సమాచారాన్ని సేకరించి, పూర్తిస్థాయిలో పరిశీ లన, ధ్రువీకరణ అనంతరం జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ రూపొందిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్‌ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ప్రణాళికాధికారి సునీత, జిల్లా పంచా యతీ అధికారి అనూష, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ అంకిత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement