తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద | - | Sakshi
Sakshi News home page

తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద

Jul 22 2026 12:18 AM | Updated on Jul 22 2026 12:18 AM

చర్ల: మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 25 గేట్లలో 15 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 10,738 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా, బీజాపూర్‌, దంతెవాడ జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74మీటర్లకు గాను మంగళవారం ఉదయం 73.43 మీటర్లు ఉండగా, అంతకంతకు పెరుగుతూ మధ్యాహ్నం గరిష్టస్థాయికి చేరింది. దీంతో ఒక్కొక్కటిగా 15 గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా, స్థానికంగా వర్షాభావ పరిస్థితులు ఉన్నా తాలిపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

15 గేట్లు ఎత్తి దిగువకు విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement