డబుల్ బెడ్ రూం ఇల్లు ఖాళీ చేయాలని వేధింపులకు పాల్పడుతున్నవారి పై చర్యలు తీసుకోవా లని మణుగూరు మండలం రామానుజవరం గ్రామపంచాయతీకి చెందిన, బధిర వృద్ధురాలు ఇర్రి జానకమ్మ ఫిర్యాదు చేసింది. బంధువుల సహాయంతో సోమవారం ప్రజావాణికి హాజరైంది. జానకమ్మకు భర్త కూడా లేకపోవడంతో ప్రభుత్వ ఇచ్చే పెన్షన్ ఆధారంగానే జీవనం సాగిస్తోంది. గతంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయగా, అందులోనే నివసిస్తోంది. ఇటీవల కాలంలో ఇళ్లకు మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని, తనను అక్కడి నుంచి ఖాళీ చేయాలని, తన పేరు లిస్టులో లేదంటూ వేధిస్తున్నారని వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వారిపై చర్యలు తీసుకోవాలని వేడుకుంది.


