కొత్తగూడెం జీజీహెచ్‌లో అరుదైన చికిత్స | - | Sakshi
Sakshi News home page

కొత్తగూడెం జీజీహెచ్‌లో అరుదైన చికిత్స

Apr 11 2026 8:34 AM | Updated on Apr 11 2026 8:34 AM

చుంచుపల్లి: కొత్తగూడెం రామవరానికి చెందిన నిర్మలకు ప్రమాదవశాత్తు ఇనుపరేకు తగిలి చెవి భాగం పూర్తిగా తెగిపోయింది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు గురువారం కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించ గా క్లిష్టమైన శస్త్రచికిత్సను వైద్య బృందం విజ యవంతంగా నిర్వహించింది. ఈఎన్‌టీ విభా గం డాక్టర్‌ శాంసన్‌ ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరగగా.. ప్రస్తుతం రోగి పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.

డయాగ్నస్టిక్‌ సెంటర్లలో తనిఖీ

ఇల్లెందు: పట్టణంలోని పలు డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ప్రథమచికిత్స కేంద్రాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారుల బృందం తనిఖీ చేసింది. శుక్రవారం జిల్లా క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ రాందాస్‌ ఆధ్వర్యంలో ఆంజనేయ మెడికేర్‌ క్లినిక్‌, డయాగ్నస్టిక్‌ సెంటర్‌ను తనిఖీచేశారు. ఆ సెంటర్‌ నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. జనతా, న్యూ జనతా ప్రథ మ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. రోగులకు వాడిన సూదులను మళ్లీ వాడుతున్నట్లు గ్రహంచి, అనవసరమైన వాటికి టెస్టులు చేయించుకునేలా ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించి, నోటీసులు అందజేశామని అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో డిప్యూటీ డెమో నాగలక్ష్మి, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ బేబీ, జూనియర్‌ అసిస్టెంట్‌ శ్రీధర్‌, మణికంఠ, ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

రేక్‌ పాయింట్‌కు 3,017 మె.టన్నుల యూరియా

చింతకాని: చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రేక్‌ పాయింట్‌కు శుక్రవారం ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. ఇందులో ఖమ్మం జిల్లాకు 757.16 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 1,130 మె.టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 630 మె. టన్నులు సరఫరా చేసినట్లు వెల్లడించారు. మిగతా 500 మెట్రిక్‌ టన్నుల యూరియాను బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేశామని తెలిపారు.

అక్రమంగా

పశువుల రవాణా..

ముగ్గురు అరెస్ట్‌

భద్రాచలంటౌన్‌: నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పట్టణ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ బి.రామకృష్ణ కథనం ప్రకారం.. ఫారెస్ట్‌ చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఎనిమిది పశువులను మేత, నీరు లేకుండా ఇరుకుగా తరలిస్తున్న వాహనం పట్టుబడింది. దుమ్ముగూడెం పరిసర గ్రామాల్లో పశువులను కొనుగోలు చేసి కొత్తగూడెం తరలిస్తుండగా పట్టుకున్నారు. డ్రైవర్‌ మందా శ్రీను, మహమ్మద్‌ సమ్మర్‌, షేక్‌ సాధిక్‌పాషాను అరెస్ట్‌ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. స్వాధీనం చేసుకున్న పశువులను పాల్వంచ గోశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రామకృష్ణ వెల్లడించారు.

దాడిచేసిన

వ్యక్తిపై కేసు

ఇల్లెందురూరల్‌: మండలంలోని సుభాష్‌నగర్‌ గ్రామ పంచాయతీ బుడగజంగాలకాలనీకి చెందిన యువకులు రాము, జంపన్న మధ్య డబ్బుల విషయంలో వాగ్వా దం చోటుచేసుకుంది. జంపన్న సోదరుడు శ్రీనివాస్‌ ఇదే విషయంపై రామును ప్రశ్నించగా.. తనచేతిలో ఉన్న బీరుసీసాతో శ్రీనివాస్‌పై దాడి చేశాడు. గాయ పడిన శ్రీనివాస్‌ను స్థానికులు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. జంపన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఎస్‌ఐ సారంగపాణి తెలిపారు.

చోరీ కేసులో

నిందితుడి అరెస్ట్‌

బూర్గంపాడు: మోతె పట్టీనగర్‌ జీపీ చింతకుంట గ్రామానికి చెందిన కుంజం లక్ష్మయ్య ఇంట్లో 2025 డిసెంబర్‌లో చోరీ జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేర కు కేసునమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడిన కుక్కునూరు మండలానికి చెందిన కుమ్మరపల్లి రాజేశ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ మేడా ప్రసాద్‌ తెలిపారు. నిందితుడి నుంచి సెల్‌ఫోన్‌, పల్సర్‌ బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు పంపినట్లు ఎస్‌ఐ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement