చుంచుపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన మాతృ, శిశు వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషి చేస్తున్నారు. ఏజెన్సీ ఆసుపత్రుల్లో రేడియాలజిస్టులను నియమించడంతోపాటు టిఫ్ఫా స్కానింగ్‌కు అందుబాటులోకి తెచ్చారు. వైద్య విధాన పరిషత్ పరిధిలోని భద్రాచలం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు ఆస్పత్రుల్లో ఇప్పటికే టిఫ్ఫా స్కానింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక అశ్వారావుపేట, చర్ల ఆస్పత్రుల్లో గత కలెక్టర్ జితేష్ పాటిల్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు చొరవతో టిఫ్పా స్కానింగ్ యంత్రాలు సమకూరాయి. ఇటీవల బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ అంకిత్ చొరవతో అశ్వారావుపేట, చర్ల ఆస్పత్రుల్లో రేడియాలజిస్టులను నియమించారు. దీంతో జిల్లాలోని ఆరు ఆస్పత్రుల్లో పూర్తి స్థాయిలో రేడియాలజీ సేవలు అందుతున్నాయి. టిఫ్ఫా స్కానింగ్ అందుబాటులోకి రావడంతో గర్భిణులు పూర్తిస్థాయిలో మాతృసేవలు పొందుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వ్యయప్రయాసలు తప్పాయి. గర్భంలోని శిశువు అవయవాల అభివృద్ధిని వివరంగా పరిశీలించి, పుట్టుకలో వచ్చే లోపాలను టిఫ్ఫా స్కాన్‌తో ముందుగానే గుర్తించవచ్చు. తద్వారా అవసరమైన చికిత్స అందించే అవకాశం ఉంది.
టిఫ్ఫా స్కానింగ్ సేవలు కూడా
అందుబాటులోకి


