రాపత్తు సేవలు షురూ..
డీఎస్పీ బంగ్లాలో తొలి వేడుక
వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా రామాలయంలో మంగళవారం రాపత్తు సేవలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ సేవను నిర్వహించగా.. ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారిని పల్లకీ సేవగా ఏఎస్పీ కార్యాలయం(డీఎస్పీ బంగ్లా) వద్ద నున్న మండపంలో కొలువుదీర్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిత్‌రాజ్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


