పురపోరుకు సన్నాహాలు
ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీలు, జనాభా..
మున్సిపాలిటీలు వార్డులు మొత్తం ఎస్టీ ఎస్టీ
జనాభా జనాభా జనాభా
ఇల్లెందు: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. వార్డులవారీగా హద్దులను ఖరారు చేసి దాని పరిధిలోని పోలింగ్ కేంద్రాలను గుర్తించే ప్రక్రియను అధికారులు చేపట్టారు.
గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఇల్లెందు..
136 ఏళ్ల చరిత్ర కలిగిన ఇల్లెందును 1986లో గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అంతకు ముందు 1964లో గ్రామపంచాయతీగా ఉంది. అనతి కాలంలోనే ఆనాటి పాలకులు నగర పంచాయతీగా మార్చారు. 1981 నాటి జనాభా లెక్కల ప్రకారం ఆనాడు 27 వేల పైచిలుకు ఓటర్లు, 50 వేల జనాభా 20 వార్డులు ఉండటంతో 1986లో గ్రేడ్–3 మున్సిపాలిటీగా గుర్తించారు. 1987లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సీపీఎం నుంచి వై.వినయ్‌కుమార్ చైర్మన్‌గా గెలుపొందారు. అయితే, కాలక్రమేణా బొగ్గు బావులు మూత పడటంతో వేలాది మంది కార్మికులు, కుటుంబాలతో ఇతర ప్రాంతాలకు బదిలీపై తరలిపోయారు. దీంతో 1995లో నగర పంచాయతీగా మారిపోయింది. ఈ క్రమంలో 2000లో 43 వేల జనాభా, 28 వేల ఓటర్లు ఉండటంతో మళ్లీ మున్సిపాలిటీ హోదా లభించింది. 2005లో ఓటర్లు, జనాభా తగ్గింది. 2014లో జరిగిన ఎన్నికల్లో 33 వేల జనాభా, 27 వేల ఓటర్లకు తగ్గారు. 2020లో 24 వార్డులు 32,002 మంది ఓటర్లు, 50 వేల జనాభా ఉండగా ప్రస్తుతం 2025 నాటికి 33,732 మంది జనాబా, 32 వేల మంది ఓటర్లు, 24 వార్డులు ఉన్నాయి.
తగ్గిన కార్మికులు
ఇల్లెందుకు రైలు కలగానే మిగిలిపోయింది. ఇల్లెందు నుంచి మణుగూరు, కొత్తగూడెం, విజయవాడ, హైదరాబాద్, ఆదిలాబాద్ వరకు వెళ్లే సింగరేణి ప్యాసింజర్ రైలును రద్దు చేశారు. బొగ్గు గనులు మూతపడటంతో ఇల్లెందు జనాభాపై తీవ్ర ప్రభావం చూపింది. 1982లో ఇల్లెందులో ఐదు బొగ్గు బావుల్లో 6,838 ఉద్యోగులు పని చేశారు. 1985లో ఏడు బొగ్గు బావులు ఉండగా 7,258 ఉద్యోగులు పని చేశారు. 1988 నాటికి 9,092కు ఉద్యోగులు పెరగడంతో ఇల్లెందు కళకళలాడింది. తర్వాత బొగ్గు బావుల మూసివేతతో కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఇల్లెందు ఏరియా ఉద్యోగుల సంఖ్య 450కి చేరింది. కాగా, మున్సిపాలిటీ పరిధిలో 32,002 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 15,515 మంది, మహిళా ఓటర్లు 16,487మంది వరకు ఉన్నారు. 24 వార్డుల్లోనూ బీసీలు అధికంగా ఉన్నారు.
ఇప్పటి వరకు చైర్మన్‌లు వీరే..
ఇల్లెందు మున్సిపాలిటీ 1985లో ఏర్పడింది. 1986–91లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నుంచి వై.వినయ్‌కుమార్ గెలుపొందగా 1991–94 వరకు ప్రత్యేక అధికారి పాలన సాగింది. 1995 నుంచి 2009 వరకు సీహెచ్ రాజమల్లు, 2000 నుంచి 2005 వరకు యదళ్లపల్లి అనసూర్య, 2005 నుంచి 2010 వరకు మొలబాబు, 2010 నుంచి 2014 వరకు ప్రత్యేక అధికారి పాలన సాగింది. 2014 నుంచి 2019 వరకు మడత రమావెంకట్‌గౌడ్, 2020 నుంచి 2025 వరకు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు చైర్మన్లుగా ఉన్నారు.
అశ్వారావుపేట 22 20,040 2,457 3,310
ఇల్లెందు 24 33,732 2,574 6,894
కొత్తగూడెం(కార్పొ) 60 1,70,897 30,904 33,287
ఏదులాపురం 32 38,210 4,024 8,770
కల్లూరు 20 22,748 3,732 5,516
మధిర 22 30,856 1,083 8,322
సత్తుపల్లి 23 31,857 1,996 4,765
వైరా 20 31,056 2,090 7,226
ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కసరత్తు


