● మార్మోగిన రామనామం
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రగిరిలో రామనామం మార్మోగింది. ఉత్తర ద్వార దర్శనానికి ముందు శ్రీసీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ స్థానాచార్యులు కేఈ స్థలశాయి వైకుంఠ ద్వారా దర్శన ప్రాశస్త్యాన్ని వివరించారు. ఉత్తర ద్వారంలో పూజలు, భక్తుల సందర్శనానంతరం స్వామివారు తిరువీధి సేవకు బయలుదేరారు. కాగా, ఈ ఏడాది వేడుకలకు మంత్రులు ఎవరూ హాజరుకాలేదు. భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్ – మనీషా దంపతులతో పాటు ఇతర అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు.
– స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం


