వందేళ్ల వేడుకల్లో భాగస్వాములు కావాలి..
సూపర్‌బజార్(కొత్తగూడెం)/పాల్వంచ: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగస్వాములై విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా కోరారు. మంగళవారం ఆయన కొత్తగూడెంలోని శేషగిరిభవన్‌లో నిర్వహించిన పార్టీ పట్టణ విస్తృతస్థాయి సమావేశంతోపాటు పాల్వంచలోని గణేశ్‌సాయి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మండల, పట్టణ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల చరిత్ర కార్మిక, కర్షక, పేద ప్రజల పోరాటాలతో ముడిపడి ఉందని, జనవరి 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు భారీగా తరలిరావాలని కోరారు. జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రచారజాత నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు భావజాలం అవసరమని, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ అగ్రభాగాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, ఎస్‌కె ఫహీమ్, నేరెళ్ల రమేశ్, గోనె మణి, విజయలక్ష్మి, వంగా వెంకట్, గడ్డం రాజయ్య, ఎండీ యూసుఫ్, పిడుగు శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, గుత్తుల శ్రీనివాస్, పి.సత్యనారాయణచారి, తూముల శ్రీనివాస్, ముత్యాల విశ్వనాథం, వీసంశెట్టి పూర్ణచందర్‌రావు, రాహుల్, విశ్వేశ్వరరావు, పద్మజ, వెంకటేశ్వర్లు, అజిత్, రాంబాబు, శ్రీనివాసరావు, చెన్నయ్య, కృష్ణ, రామారావు, చేరాలు, రెహమాన్, యాకయ్య, జకరయ్య, సత్యనారాయణ, వెంకన్న, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


