మతోన్మాద రాజకీయాన్ని తిప్పికొట్టాలి
తిరుమలాయపాలెం: కేంద్రంలో బీజేపీ ఆలంబిస్తున్న మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సీపీఎం శ్రేణులు సమశీల పోరాటాలకు సిద్ధం కావా లని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చా రు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో మంగళవారం జరిగిన పాలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలు ఆర్థిక భారాలు మోయలేక ఉద్యమాల్లోకి రాకుండా మతోన్మాద రాజకీయాలు చేస్తూ రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఈమేరకు సైద్ధాంతికంగా ఎదుర్కొనేలా సీపీఎం కార్యకర్తలు సిద్ధం కావడమేకాక ప్రజల సమస్యలపైనా పోరాడాలని సూచించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. గ్రామపంచాయతీ స్థానిక ఎన్నికల్లో సీపీఎంకు మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులను సన్మానంచారు. అనంరం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ పాలేరు డివిజన్‌లో ఎనిమిది మంది సర్పంచ్‌లు, ఏడుగురు ఉప సర్పంచ్‌లు, 100కు పైగా వార్డుసభ్యులు గెలవడం అభినందనీయమన్నారు. పొన్నం వెంకటేశ్వరరావు, షేక్ బషీరుద్దీన్, బండి రమేష్, బండి పద్మ, ఎర్ర శ్రీనివాసరావు కూడా మాట్లాడారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ


