కాంగ్రెస్‌తోనే సమగ్రత, అభివృద్ధి
కొత్తగూడెంఅర్బన్: కాంగ్రెస్‌తోనే దేశ సమగ్రత, అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న అన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకలను త్రీ టౌన్ సెంటర్‌లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, మతసామరస్యం కోసం పార్టీ నాయకులు పాటుపడాలని అన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు సత్యనారాయణ, ఆళ్ల మురళి, నాగ సీతారాములు, జేబీ బాలశౌరి, ఏనుగుల అర్జున్ రావు, చీకటి కార్తీక్, పౌలు, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ వై. శ్రీనివాసరెడ్డి, చింతలపూడి రాజశేఖర్, బాలపాసి, రావి రాంబాబు, మేరెడ్డి జనార్ధనరెడ్డి, పరమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా అని టీపీసీసీ సభ్యుడు, ఎస్సీ సెల్ కన్వీనర్ జేబీ శౌరి అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ అధ్యక్షుడు గౌస్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాయకులు నరసింహారావు, అజ్మీర సురేష్, ఎండి కరీం, కాజా బాక్స్, కసనబోయిన భద్రం, నిసార్, భిక్షపతి, కరీం తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షురాలు దేవీప్రసన్న


