మార్చిలో రైతు సంఘం రాష్ట్ర మహాసభలు
రుద్రంపూర్: మార్చి 16,17,18 తేదీల్లో కొత్తగూడెం పట్టణంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు అఖిల భారత కిసాన్ సభ జాతీయ కమిటీ సభ్యులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని రామటాకీస్ రోడ్‌లో నిర్వహిచింన మహాసభల ఆహ్వాన సంఘం సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశాన్ని లూటీ చేసిందని, రూ. 200 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నను దివాళా తీయించి రోడ్డున పడేసిందన్నారు. విత్తన చట్టం పేరుతో రైతులకు నష్టం చేసేలా, కార్పొరేట్లకు అనుకూలంగా బిల్లు తీసుకొస్తున్నారని ఆరోపించారకు. రాష్ట్ర కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రైతులను ఐక్యపరిచి ఉద్యమాలు నిర్మిస్తామని అన్నారు. ఎలమంచిలి వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు పోతినేని సుదర్శన్ రావు, ఎం.సాయిబాబు, నున్నా నాగేశ్వరరావు, మచ్చా వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు, మూడ్ శోభన్, మా దినేని రమేష్, అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, అన్నవరపు సత్యనారాయణ, కొక్కెరపాటి పుల్లయ్య, కారం పుల్లయ్య, కే.బ్రహ్మాచారి, నర్సారెడ్డి, బాలరాజు, రేపాలకు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు నాగా సీతారాములు, తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు
జూలకంటి రంగారెడ్డి


