బాల్‌బ్యాడ్మింటన్ టోర్నీ షురూ
ఖమ్మంస్పోర్ట్స్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలస్థాయి బాల్ బ్మాండ్మింటన్ టోర్నీ (పులి రామస్వామి స్మారక ఇన్విటేషన్ పోటీలు) శనివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వీటిని డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డి, రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ కార్యదర్శి వీవీ రమణ, జిల్లా అధ్యక్షుడు వేజెళ్ల సురేశ్, టోర్నీ కన్వీనర్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి ప్రారంభించారు. రెండు రాష్ట్రాల నుంచి 24 జట్లతో పాటు 40 మంది జాతీయ క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరుగుతాయన్నారు. కార్యక్రమంలో విజయ్‌ప్రసాద్, టి.రామచంద్రరాజు, పులి మధు, విజయ్‌కలామ్, ఎర్రగుట్ట స్వామి, మణి భూషణచారి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
తొలిరోజు విజేతలు వీరే..
తొలిరోజు పోటీల్లో కూకట్‌పల్లి జట్టుపై భూపాలపల్లి విజయం సాధించింది. అలాగే.. అనంతరపూర్ – వరంగల్‌పై.. మణికొండ – రమణస్ వైజాగ్‌పై.. ఈస్ట్ గోదావరి – బీహెచ్‌ఈఎల్‌పై.. ఎస్‌సీఆర్ గుంటూరు – నునాపర్తిపై.. కరీంనగర్ – ఖమ్మంపై విజయం సాధించాయి. ఆదివారం సాయంత్రం బహుమతి ప్రదానం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు.
రెండు రాష్ట్రాల నుంచి 24 జట్లు హాజరు..
బాల్‌బ్యాడ్మింటన్ టోర్నీ షురూ


