ప్రతీ పైస.. ప్రజల అభివృద్ధికే
నేలకొండపల్లి : ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పైస ప్రజల సంక్షేమం, అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి శనివారం ఆయన.. మండలంలోని అనంతనగర్‌లో రూ.2.25 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం, రూ.1.75 కోట్లతో నిర్మించనున్న సబ్‌ష్టేషన్‌కు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. గత పాలకులు రాష్ట్ర ప్రజలపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపినా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అవమలు చేయలేదని అన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతీ వారం బిల్లులు జమ చేస్తున్నామని చెప్పారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా పేదల ముఖంలో ఆనందం చూడాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, తిగుళ్ల భవాని, పెంటమళ్ల పుల్లమ్మ, గరిడేపల్లి రామారావు, కడియాల నరేష్, పాకనాటి కన్నారెడ్డి, కొమ్మినేని విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క


