బయ్యారంలో జాతీయ పోటీలు
జనవరి 7 నుంచి
ఐదురోజులపాటు కబడ్డీ క్రీడలు
పినపాక: జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలకు పినపాక మండలంలోని ఈ. బయ్యారం జిల్లా పరిషత్ హై స్కూల్ ఎంపికై ంది. రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించిన అనుభవం, గ్రామస్తుల సహకారంతో జాతీయస్థాయి పోటీలకు పాఠశాల ముస్తాబవుతోంది. జనవరి 7 నుంచి ఐదు రోజులపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాలుర కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. పోటీలకు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల బాలుర జట్లు పాల్గొననున్నాయి. బాలికల జాతీయస్థాయి పోటీలు మధ్యప్రదేశ్‌లో నిర్వహించనున్నారు.
రాష్ట్ర బాలుర జట్టు ఎంపిక
జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే బాలుర జట్టు ను ప్రకటించారు. బి నాగచైతన్య, సాయిరాం, యశ్వంత్, గౌతమ్ (ఖమ్మం), దేవరాజ్ (వరంగల్), రాఘవేందర్, రవికుమార్, ఉమేష్ (హైదరాబాద్), భాను ప్రకాష్ (నల్గొండ), చందు (రంగారెడ్డి), రంగా (మెదక్), శ్రీనివాస్ (నిజామాబాద్), విష్ణువర్ధన్ (కరీంనగర్), లచ్చు (ఆదిలాబాద్), నందు (మహబూబ్ నగర్), సుమన్ (కరీంనగర్)లు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. బాలికల జట్టును అధికారులు ఎంపిక చేసి ఈనెల 26న మధ్యప్రదేశ్‌కు పంపించారు. కాగా పోటీలకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంది విశ్వభారత్ రెడ్డి పోటీలకు సహకారం అందించనున్నారు. బాలికల జట్టుకు కూడా దుస్తులు, క్రీడా సామగ్రి అందజేశారు.
భద్రతకు ప్రాధాన్యమివ్వాలి
మణుగూరు టౌన్: సింగరేణి ప్రాజెక్టుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిరంతర పర్యవేక్షణ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని చీఫ్ సెక్యూరిటీ అధికారి బాలరాజు అన్నారు. శని వారం ఆయన వ్యూపాయింట్ నుంచి మణుగూరు ఓసీ, బంకర్ చెక్‌పోస్ట్ ఏరియా, బోర్‌వెల్ ఏరియా, మెయిన్ మ్యాగజిన్‌లను పరిశీ లించారు. ఎస్‌అండ్‌పీసీ సిబ్బందితో సమావేశమై భద్రతా అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన్ను ఏరియా జీఎం దుర్గం రాంచందర్ శాలువాతో సన్మానించారు. ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్, జూనియర్ ఇన్‌స్పెక్టర్ రాజనర్సు తదితరులు ఉన్నారు.
బయ్యారంలో జాతీయ పోటీలు


