కొండరెడ్ల అభివృద్ధికి కృషి
దమ్మపేట: కొండరెడ్ల సమగ్ర అభివృద్ధి, స్వయం సమృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని కొండరెడ్ల ఆవాస గ్రామం పూసుకుంటను ఆయన ఎమ్మె ల్యే జారే ఆదినారాయణతో కలిసి సందర్శించారు. పామాయిల్ మొక్కలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇద్దరు మహిళలకు రెండు పిండి మిల్లులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష జరి పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వ యం ఉపాధి కల్పిస్తామని, హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని అన్నారు. పంచాయతీ కార్యాలయం, ప్రా థమిక ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మిస్తామని చెప్పా రు. పిల్లలందరూ పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బీటీ రోడ్డు, కల్వర్టులను ఉగాదిలోపు పూర్తి చేయాలని, సరుకుల రవాణాకు వాహనం మంజూరు చేయాలని చెప్పా రు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తి కోయలకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని అన్నారు. సమీక్షకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకో వాలని ఐటీడీఏ పీఓను ఆదేశించారు. ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ పూసుకుంటలో రెండేళ్లుగా ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ పూసుకుంటను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకుని పట్టు పురుగులు, మునగ చెట్లు, మేకలు, కౌజు పిట్టల పెంపకం వంటివి చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాహుల్, పలు శాఖల అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి,పూసుకుంట సర్పంచ్ యాట్ల రాజిరెడ్డి, ఉపసర్పంచ్ బాబూరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


