నిర్మాణాలకు అనుమతులు ఉండాలి
అశ్వారావుపేటరూరల్: మున్సిపాలిటీ పరిధిలో భవనాల నిర్మాణాలు, పక్కా గృహాలకు అనుమతులు తీసుకోవాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. శనివారం ఆయన అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని లక్కీ అపార్ట్‌మెంట్ ఏరియా, పోకల బజార్, వికలాంగుల కాలనీ, ఫైర్ కాలనీ, ఆటో నగర్ ప్రాంతాలను సందర్శించారు. స్థానికులతో మాట్లాడి చెత్త సేకరణ, ఇంటి పన్నుల చెల్లింపులు, భవన నిర్మాణ అనుమతులపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించాలని, నిర్మాణాలకు అనుమతి తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బి.నాగరాజు, సిబ్బంది ఉన్నారు.
ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ


