శత వసంతాల సభకు తరలిరావాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): సీపీఐ శత వసంతాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చే నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా తెలిపారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి కావడంతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఎరజ్రెండాలు ఎగురవేసి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ 1925లో కాన్పూరులో ఆవిర్భవించిన సీపీఐ శుక్రవారంతో శత వసంతాలు పూర్తి చేసుకుందని అన్నారు. స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. జనవరి 18న ఖమ్మంలో నిర్వహించే సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, దుర్గరాశి వెంకన్న, వాసిరెడ్డి మురళీ, జి వీరస్వామి, ఫయిమ్, భూక్యా శ్రీనివాస్, ధీటి లక్ష్మీపతి, గెద్దాడ నగేష్, మునిగడప వెంకన్న, నేరేళ్ల రమేష్, మునిగడప పద్మ పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా


