కోటెమ్మ ఆలయంలో మంత్రి సీతక్క పూజలు
ములకలపల్లి: నర్సాపురం శివారులోని కోటెమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క శుక్రవారం ప్రత్యేక పూజ లు చేశారు. జగన్నాథపురం నుంచి కోటెమ్మ తల్లి ఆలయం వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని కోరు తూ స్థానికులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ కుంజా వినోద్, ఆలయకమిటీ అధ్యక్షుడు బజ్జూరి కృష్ణ, కారం సుధీర్, అడపా నాగేశ్వరరావు, కుంజా సంతోష్, గుంట్రు సాయి, బజ్జూరి వినయ్ తదితరులు ఉన్నారు.


