భద్రాద్రిలో భక్తజన సంద్రం..
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. 2025 ఏడాది ముగుస్తుండడంతో పాటు వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాక పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం తెల్లవారుజాము నుండే గోదావరి స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. ఏడాది చివరి వారం కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ దామోదర్‌రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రద్దీ పెరిగినా భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
వరుస సెలవులతో పోటెత్తిన జనం


