ముగిసిన వాజ్‌పేయ్ శత జయంతోత్సవం
చుంచుపల్లి: భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయ్ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యాన శుక్రవారం కొత్తగూడెం ఐఎంఏ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జ్ డాక్టర్ విజయ్ చందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు మాట్లాడుతూ.. ఎవరి మద్దతు లేకుండా ప్రధానమంత్రి పదవిని తునప్రాయంగా వదిలేసి ప్రజా తీర్పు కోసం మళ్లీ ప్రజల్లోకి వెళ్లిన మహనీయుడు వాజ్‌పేయ్ అని ఆయన సేవలను గుర్తు చేశారు. ఒక గిరిజన మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. దొంగ ఓట్లు ఉన్నాయని ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పదేపదే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్‌రావు, కుంజా ధర్మ, జంపన సీతారామరాజు, జిల్లా కార్యదర్శి నోముల రమేష్, నాయకులు పాల్గొన్నారు.


