పాత పద్ధతిలోనే..
జిల్లాలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అందుబాటులోకి రాకపోవడంతో శుక్రవారం పాత పద్ధతుల్లోనే యూరియా విక్రయించేందుకు పీఏసీఎస్ అధికారులు చర్యలు తీసుకున్నారు. గత నెలరోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో పీఏసీఎస్ గోదాంలలో ఉన్న 700యూరియా బస్తాలకు వేయిమందికి పైగా రైతులు తమ ఆధార్, పట్టాదారు పుస్తకాలతో
క్యూకట్టారు. ఇందులో 20శాతం మందికి కూడా యూరియా అందలేదు. మళ్లీ లారీ వచ్చే వరకు రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితులున్నాయి. దీంతో రైతులు సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌లోని కుక్కునూరు, కూనవరం మండలాలకు వెళ్లి ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు.


