వాజ్‌పేయ్‌కి ఘన నివాళి
పాల్వంచరూరల్ : మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయ్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. మండలం, పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో వాజ్‌పేయ్ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో పట్టణఅధ్యక్షుడు రాపాక రమేష్, చింతలచెరువు శ్రీనివాసరావు, భూక్యా రవి, రంజిత్, నాగరాజు, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, బుడగం రవికుమార్, గంధ మల్లయ్య, దున్నపోతులరాజు, ప్రవీణ్, కార్తీక్, కనగాల క్రాంతికుమార్, కాల్వ సుధాకర్ పాల్గొన్నారు.
నేడు అర్చక, ఉద్యోగుల
సమావేశం
ఖమ్మంగాంధీచౌక్: దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగల సమావేశాన్ని ఖమ్మంలోని పవనసుత జలాంజనేయ స్వామి ఆలయం వద్ద శుక్రవారం నిర్వహిస్తున్నట్లు సంఘం బాధ్యులు దాములూరి వీరభద్రరావు, తోటకుర వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు, కారుణ్య నియామకాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్ల సమస్యలు, హెల్త్ కార్డులపై చర్చించనున్న ఈ సమావేశానికి అర్చక, ఉద్యోగులు హాజరుకావాలని కోరారు.


