పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.లక్ష విరాళం
ములకలపల్లి: మండలంలోని పొగళ్లపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తాండ్ర నారాయణరావు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, ఎన్నారై తాండ్ర వెంకటేశ్వరరావు గురువారం రూ.లక్ష విరాళం ఎస్సై మధుప్రసాద్‌కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నేర నియంత్రణకు పోలీస్ శాఖకు సహకరిస్తూ, తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితరణ అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నరాటి ప్రసాద్, తాండ్ర చిట్టిబాబు, కొదుమూరి పుల్లారావు, పూరేటి నర్సింహారావు పాల్గొన్నారు.
‘మిస్ టీన్ తెలంగాణ’ పోటీల్లో ప్రతిభ
భద్రాచలంటౌన్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇటీవల నిర్వహించిన ‘ఫరెవర్ మిస్ టీన్ ఇండియా–2025’ అందాల పోటీల్లో భద్రాచలం పట్టణానికి చెందిన విద్యార్థిని ప్రీతి యాదవ్ ప్రతిభ చాటింది. ఈనెల 19 నుంచి 21 వరకు జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె ‘ఫరెవర్ మిస్ టీన్ తెలంగాణ–2025’ కిరీటాన్ని కై వసం చేసుకుంది. దేశ వ్యాప్తంగా 10 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. వివిధ దశల్లో వడపోతల తర్వాత ఫైనల్స్ చేరుకున్న 101 మందిలో ప్రీతి యాదవ్ విజేతగా నిలిచింది. భద్రాచలం పట్టణంలో పానీపూరి వ్యాపారం చేసే ప్రకాష్ యాదవ్, రేణు యాదవ్ దంపతుల కుమార్తె ప్రీతి స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సామాన్య కుటుంబం నుంచి వచ్చినా ఆత్మవిశ్వాసంతో జాతీయ వేదికపై తెలంగాణ గర్వపడేలా రాణించిన ప్రీతిని పలువురు అభినందించారు.
ఓవరాల్ చాంపియన్‌గా ‘తనికెళ్ల’
కొణిజర్ల: ఉమ్మడి జిల్లాస్థాయి మైనార్టీ బాలుర గురుకులాల క్రీడాపోటీల్లో తనికెళ్లలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పలు విభాగాల్లో పతకాలు సాధించడమే కాక ఓవరాల్ చాంపియనషిప్ కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి(ఆర్‌ఎల్‌సీ) ఎంజే. అరుణకుమారి అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎల్.జితేష్ సాహిల్, పీడీ ఎం.రవికుమార్, పీఈటీ బండారు సాయికృష్ణతో డిప్యూటీ వార్డెన్ యాకూబ్ పాషా పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన


