లక్ష్య సాధనకు ఐక్యంగా కృషి చేయాలి
రుద్రంపూర్ : బొగ్గు ఉత్పత్తిలో వార్షిక లక్ష్య సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని కోల్ మూమెంట్ ఈడీ, చీఫ్ విజిలెన్స్ అధికారి బి.వెంకన్న సూచించారు. కొత్తగూడెం ఏరియా పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న వీకే–7 ఓసీని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓసీ నుంచి జనవరి నెలాఖరు నాటికి ఉత్పత్తి ప్రారంభం కావాలని, వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్, ఇతర పరిశ్రమలకు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. వార్షిక లక్ష్యానికి మూడు నెలలు మాత్రమే గడువు ఉన్నందున రక్షణతో కూడిన మెరుగైన ఉత్పత్తి సాధించాలని సూచించారు.
రోజుకు వే యి టన్నులు ఉత్పత్తి చేయాలి
పీవీకే–5 ఇంక్‌లైన్ భూగర్భ గనిలో రోజుకు 1000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని వెంకన్న అఽధికారులను ఆదేశించారు. సీఎమ్మార్ ద్వారా ఉత్పత్తి అవుతున్న గ్రేడ్ జీ–6 బొగ్గుకు మార్కెట్‌లో మంచి ధర ఉందని చెప్పారు. గనిలో యంత్రాల పని గంటలు పెంచితేనే రోజుకు అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందని సూచించారు. కార్యక్రమంలో ఏరియా జీఎం ఎం. శాలేంరాజు, వీకే–7 ఓసీ పిఓ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
కోల్ మూమెంట్ ఈడీ వెంకన్న


