●ఆరు శతాబ్దాల చరిత్ర
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం రైటర్‌బస్తీలోని ఆర్‌సీఎం చర్చికి ఆరు శతాబ్దాల చరిత్ర ఉంది. 1923లో కొందరు కేథలిక్‌లు బొగ్గు గనుల్లో పనిచేయడానికి వచ్చి కొత్తగూడెంలో స్థిరపడ్డారు. వీరి కోసం ప్రార్థనలు నిర్వహించేందుకు కాజీపేట నుంచి ఫాదర్ వచ్చేవారు. తొలుత 1928లో ఫాదర్ జీ సెమినాటి చర్చిని నిర్మించారు. ఆ తర్వాత జీ.పజ్జాలింగిని, డాల్ బాల్కన్, జీ.బెరెట్టా నేతృత్వాన ప్రస్తుతం ఉన్న చర్చిని 1944లో నిర్మించారు. మొదటి ఫాదర్‌గా జే టింటి, మొదటి ప్రెస్‌బైటరీగా కార్లోసిల్వా వ్యవహరించారు. ఆపై 1971లో కొత్తగూడెం చర్చిని మంజుమ్మల్ ప్రావిన్స్‌లోని ఓసీడీ మిషనరీలకు అప్పగించారు. ప్రస్తుతం కార్మైలెట్ మిషనరీలు కొనసాగిస్తుండగా ప్రస్తుతం ఓసీడీగా జయానంద్ వ్యవహరిస్తున్నారు.


