చికిత్స పొందుతున్న యువకుడు మృతి
పాల్వంచరూరల్: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు ఉరివేసుకోగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మండలంలోని ఉల్వనూరు కొత్తూరు గ్రామానికి చెందిన, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కాలం దిలీప్‌కుమార్ (28) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 21వ తేదీ రాత్రి ఇంటి వెనుక రేకుల షెడ్‌లో తాడుతో ఉరివేసుకోగా.. కుటుంబ సభ్యులు గమనించి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి రాందాస్ బుధవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు.
అనుమానంతో భార్యపై కత్తితో దాడి
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని పాత మార్కెట్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం సోడే లక్ష్మిపై ఆమె భర్త సత్యం కత్తితో దాడి చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. గత ఏప్రిల్‌లో సోడె సత్యం తన భార్యపై పులిగుండాలకు చెందిన ఉపాధ్యాయుడు లైంగికదాడి చేశాడని చర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి భార్యతో సత్యం దూరంగా ఉంటున్నాడు. లక్ష్మి భద్రాచలం పట్టణంలోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. కాగా, మూడు రోజులుగా లక్ష్మి కదలికలపై సత్యం నిఘా పెట్టాడు. పట్టణంలోని పాత మార్కెట్‌లో గల ఓ వస్త్ర దుకాణంలో బట్టలు కొనుగోలు చేసిన లక్ష్మి చర్చికి వెళ్తున్న క్రమంలో సత్యం కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన స్థానికులను కూడా బెదిరించాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టౌన్ ఎస్‌ఐ స్వప్న బాధితురాలి కుటుంబ సభ్యులను ఆరా తీస్తున్నారు.
టీవీ చోరీపై విచారణ
పాల్వంచరూరల్: మండలంలోని పాండురంగాపురం రైతువేదికలోని టీవీని గత నవంబర్‌లో గుర్తుతెలియని దుండగులు అపహరించగా.. విచారణ అధికారి, కొత్తగూడెం ఏడీఈ బుధవారం విచారణ చేపట్టారు. రూ.2 లక్షల విలువైన టీవీ చోరీకి గురవడంపై ఏఈఓ అనురిను, ఏఓ శంకర్‌ను ఆయన విచారించారు.
పోలీసుల అదుపులో గంజాయి ముఠా?
బూర్గంపాడు: మండలంలోని మోరంపల్లిబంజరలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గ్రామస్తుల సమాచారం మేరకు బుధవారం రాత్రి పోలీసులు దాడి చేసి గంజాయి సేవిస్తున్న ముగ్గురి అదుపులోకి తీసుకోగా.. మరికొందరు పరారైనట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను విచారిస్తున్నట్లు తెలిసింది.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
సుజాతనగర్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన కొత్త అంజనాపురం పంచా యతీ పరిధిలోని రూప్లాతండాలో బుధవారం చోటుచేసుకుంది. గ్రా మానికి చెందిన భూక్యా లాల్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ముందు భాగంలో తాత్కాలికంగా రేకులషెడ్ వేసుకొని అందులో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాగా మంటలు చెలరేగాయి. నిర్మాణంలో ఉన్న ఇంటి కోసం తెచ్చిన రూ.5.50 లక్షల నగదు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బంగారు ఆభరణాలు, కుమారుడి సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరాడు. ఆర్‌ఐ వీరభద్రం ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులే కారణం?
మధిర: మండలంలోని ఆత్కూరు గ్రామానికి చెందిన చౌరపు సత్యనారాయణ (40) బుధవారం అనుమానా స్పద స్థితిలో మృతిచెందాడు. సత్యనారాయణ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా, మరో ముగ్గురితో కలిసి దెందుకూరు సమీపాన ఆంధ్ర సరిహద్దులో అడ వి పందుల వేటకు వెళ్లినట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో అప్పటికే అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తాకడంతో సత్యనారాయణ తీవ్ర గాయాలై మృతి చెందినట్లు సమాచారం. దీంతో ఆయన వెంట వెళ్లిన వ్యక్తులు సత్యనారాయణ మృతదేహాన్ని వైరా రోడ్డులోని పీవీఆర్ కల్యాణమండపం సమీపంలో రోడ్డు పక్కన వేసి వెళ్లినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లుగా చిత్రీ కరించే ప్రయత్నంలో అలా చేసినట్లు తెలుస్తుండగా, వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఘటనపై కేసు నమోదు చేసినట్లు మధిర టౌన్ సీఐ రమేష్ తెలిపారు.
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
చికిత్స పొందుతున్న యువకుడు మృతి


