●నల్ల నేలపై పచ్చని హారం
ఈ దృశ ్యం చూస్తే దట్టమైన అటవీ కొండల్లా ఉన్నాయి కదూ.. కానీ, సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఓసీ–2, ఓసీ–4 డంప్‌యార్డులు ఇవి. సింగరేణి హరితహారం కార్యక్రమంలో భాగంగా డంప్‌యార్డులు, గనుల పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటించి, వాటి పర్యవేక్షణను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఏరియా జీఎం దుర్గం రాంచందర్ సూచనల మేరకు అటవీ, పర్యావరణ అధికారులు చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటించడం, మొక్కలు ఎండకు ఎండిపోకుండా నీటి సదుపాయం కల్పించడంతో పాటు నిరంతర పర్యవేక్షణను చేపట్టారు. దీంతో అప్పుడు నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి దట్టమైన అటవీ ప్రాంతాలను తలపిస్తున్నాయి. ఈ చిత్రాలు సింగరేణికి హరితహారంపై ఉన్న స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి. –మణుగూరుటౌన్


