అనాథకు ఆపన్నహస్తం
ఇల్లెందురూరల్: నా అన్న వాళ్ల ను కోల్పోయి చచ్చుపడిన కాళ్ల తో నవడలేక నేలపై పాకుతూ చలికి వణుకుతూ భిక్షాటన చేస్తున్న దివ్యాంగుడు గుగులోత్ దేవ్లాపై ‘ఎవ్వరూ లేని అనాథ..’శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. మండలంలోని సీఎస్పీబస్తీకి చెందిన ఆటోడ్రైవర్ ముజాహిద్ గుగులోత్ దేవ్లాను తన ఆటోలో తీసుకెళ్లి కటింగ్, స్నానం చేయించి నూతన దుస్తులు కొనిచ్చాడు. భోజనం తినిపించాడు. నవడలేని స్థితిలో ఉన్న గుగులోత్ దేవ్లా దుస్థితిని తెలుసుకున్న కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ స్పందించి సెర్ప్ అధికారులతో మాట్లాడగా.. సెర్ప్ సీసీ స్వర్ణలత, డిజేబుల్ అధికారి వరప్రసాద్ దేవ్లాకు ట్రైసైకిల్ అందజేశారు. కాగా, ఉండటానికి గూడు కూడా లేని దేవ్లాకు ఉన్నతాధికారులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, దివ్యాంగుల పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఆటోడ్రైవర్ ముజాహిద్, స్థానికులు కోరుతున్నారు.
అనాథకు ఆపన్నహస్తం


