ఉత్తమ రైతు పురస్కారాలు ప్రదానం
దమ్మపేట/టేకులపల్లి/అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ రంగంలో ఉత్తమ సేవలకు గాను మండలంలోని అల్లిపల్లి గ్రామానికి చెందిన ఆలపాటి రామచంద్రప్రసాద్ (పామాయిల్ సలహాదారు కమిటీ సభ్యుడు)ను కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఉత్తమ రైతుగా ఎంపిక చేసింది. మంగళవారం కొత్తగూడెంలో జరిగిన కిసాన్ దివాస్–2025 కార్యక్రమంలో భాగంగా ఆయనకు పురస్కారం అందించారు. అలాగే, టేకులపల్లి మండలం చింతోనిచెలక గ్రామానికి చెందిన కవలలు కంభంపాటి నరేశ్, నవీన్, బేతంపూడి గ్రామానికి చెందిన బచ్చలకూరి అశోక్, వెంకట్యాతండాకు చెందిన బాణోతు వీరన్న సైతం ఉత్తమ రైతు అవార్డులు అందుకున్నారు. కంభంపాటి నవీన్, నరేశ్ ప్రత్యేకంగా కవలల సేద్యం ప్రశంసాపత్రాన్ని అందుకోవడం విశేషం. అలాగే, అశ్వారావుపేట మండలం మల్లాయిగూడేనికి చెందిన దారా ప్రసాద్ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కేవీకే శాస్త్రవేత్త హేమశరత్ చంద్ర, ప్రొగ్రాం కోఆర్డినేటర్ టి.భరత్, ఏడీఏ తాతారావు పాల్గొన్నారు.
ఉత్తమ రైతు పురస్కారాలు ప్రదానం


