‘కుష్ఠు’ సర్వే వేగవంతం చేయాలి
● డీఎంహెచ్‌ఓ తుకారాం రాథోడ్
బూర్గంపాడు: కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను వేగవంతం చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. బూర్గంపాడు, గౌతమీపురం గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాధిగ్రస్తుల పూర్తి వివరాలు నమో దు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విపత్తుల నివారణ మాక్‌డ్రిల్‌లో వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశీలించారు. ప్రాణాపాయ స్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శ్రీధర్, అడిషనల్ డీఎంహెచ్‌ఓ సైదులు తదితరులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఈజీఆర్ జాన్‌వెస్లీ, జనరల్ సెక్రటరీగా ఎం.కోటేశ్వరరావు, ఫైనాన్స్ సెక్రటరీగా ఎస్‌కే గులాం అహ్మద్, అసోసియేట్ అధ్యక్షుడిగా కె.రాంబాబు, వైస్ ప్రెసిడెంట్లుగా భాస్కర్, రాయలింగు, సీహెచ్‌ఎంఎం భానుమతి, సెక్రటరీలుగా బి.కేశవరావు, కె.నాగయ్య, జాయింట్ సెక్రటరీలుగా సారయ్య, సీహెచ్ కాంతారావులతో మరికొందరు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్‌రెడ్డి పర్యవేక్షించగా, వెంకటరెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు.
టీపీసీసీ లీగల్ సెల్
జిల్లా కన్వీనర్‌గా పడిసిరి
భద్రాచలంటౌన్: టీపీసీసీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్‌గా సీనియర్ న్యాయవాది పడిసిరి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి, న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీనివాసరావు తెలిపారు.
కార్పొరేట్‌లో
ఉత్తమ ఉద్యోగుల ఎంపిక
కొత్తగూడెఅర్బన్: సింగరేణి ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా కార్పొరేట్ ఏరియాలో ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేశారు. ఎక్స్‌ప్లోరేషన్ జీఎం బి. శ్రీనివాసరావును, ప్రధాన ఆస్పత్రి సీనియర్ టెక్నీషియన్ కే.వేంకటేశ్వర ప్రసాద్, సెంట్రల్ వర్క్‌షాపు ఫిట్టర్ డీవీవీ నాగేంద్రప్రసాద్‌లన ఎంపిక చేయగా, వీరికి మంగళవారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేయనున్నారు.
నేడు కాంగ్రెస్ సమావేశం
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం క్లబ్‌లో మంగళవారం కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ఖమ్మం–భద్రాద్రి కొత్తగూడెం ఇన్‌చార్జ్‌లు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్‌లు హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాలోని శాసనసభ్యులు, రాష్ట్ర, జిల్లా కార్పొరేషన్ చైర్మన్లు, పీసీసీ కమిటీ సభ్యులు, మండల, బ్లాక్, బూత్ స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, నూతనంగా ఎన్నికై న సర్పంచులు, వార్డు మెంబర్లు సమావేశానికి హాజరుకావాలని కోరారు.
మహిళ అదృశ్యం
ఇల్లెందు: మహళ అదృశ్యంపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని కొత్తకాలనీకి చెందిన 48 ఏళ్ల బోల్ల అలివేలు ఈ నెల 18న ఖమ్మంలోని పుట్టింటికి బయల్దేరింది. కానీ అక్కడికి చేరుకోలేదు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం క్రితం భర్త చనిపోయాడు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయి, అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె కుమారుడు సంపత్ ఫిర్యాదుతో సీఐ టి. సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పశువులు స్వాధీనం
అశ్వారావుపేటరూరల్: అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న పశువులను సోమవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. స్థానిక రింగ్ రోడ్ సెంటర్లో నిర్వహించిన తనిఖీల్లో ఏపీలోని ఆలమంద సంత నుంచి వరంగల్ జిల్లా జనగామ వైపు వ్యాన్‌లో 13 ఆవులు తరలిస్తుండగా పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సరైన పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని, ఇంకా కేసు నమోదు చేయలేదని ఎస్సై యయాతీ రాజు తెలిపారు.
‘కుష్ఠు’ సర్వే వేగవంతం చేయాలి
‘కుష్ఠు’ సర్వే వేగవంతం చేయాలి


