పంచాయతీ కార్మికుడు మృతి
గుండాల: వ్యక్తిగత పనిపై వెళ్లిన గ్రామ పంచాయతీ కార్మికుడు సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. లూనావత్ దేవేందర్(35) ఏడేళ్లుగా గుండాల గ్రామ పంచాయతీలో అవుట్ సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. విధుల్లో అలసత్వం వహించడంతో రెండు నెలల నుంచి విధులకు దూరంగా ఉంటున్నాడు. సోమవారం ప్రమాణ స్వీకారం పూర్తవగానే నూతన పాలకవర్గాన్ని కలసి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అనంతరం పాలకవర్గం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి వెళ్లాడు. ఆ పరిసరాల్లోనే రోడ్డు పక్కన విగత జీవిగా కనిపించాడు. మృతుడికి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుండాల ఎస్సై సైదా రవూఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ ..
పాల్వంచరూరల్: పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ సోమవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన కోండ్రు భదయ్య(46) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా అధికంగా మద్యం తాగుతుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఆదివారం ఇంట్లోనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోగా కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు ప్రదీప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.
మృతిపై అనుమానాలు


