సామాన్యులకు అందని నాణ్యమైన విద్య
ఖమ్మం సహకారనగర్: కేంద్రప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలతో సామాన్యులకు విద్య అందకపోగా, అందరికీ సమానమైన నాణ్యమైన విద్య కూడా సాధ్యం కావడం లేదని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఖమ్మంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వెంగళరావు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విద్యారంగానికి ఏటా బడ్జెట్ తగ్గించడమే కాక ప్రాథమిక విద్యారంగానికి నిధులు కేటాయించకుండానే కొత్త పేర్లతో పాఠశాలలను ప్రారంభిస్తున్నారని తెలిపారు. అనంతరం వై.అశోక్ కుమార్, ఎం.సోమయ్య, కె.రవిచంద్ర, ఏ.రామారావు, వి.మనోహర్‌రాజు మాట్లాడగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ సీహెచ్.రమేష్, అధ్యక్షులుగా టి.వెంగళరావు, ప్రధా న కార్యదర్శిగా రాజు, అసోసియేట్ ఉపాధ్యక్షులుగా ఏ రామారావు ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా ఎం.రవీందర్, జి.రమేష్, పి. నాగేశ్వరరావు, కృష్ణయ్య, నాగమణి, ఎస్.పూర్ణచంద్రరావు, పి.వీరభద్రం, అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎన్.కృష్ణారావు, కార్యదర్శులుగా వెంకటేష్, జి.మస్తాన్, ఐ.రామకృష్ణ, లక్ష్మీనా రాయణ, కె.రామ్మోహన్‌రావు, అజీజ్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు.


