ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు
భద్రాచలంఅర్బన్: ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాకు చెందిన బిశాల్ తమంగ్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 9న కత్తితో గొంతు కోసుకోగా, పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో డీసీహెచ్ రవిబాబు, జనరల్ సర్జన్ సోమరాజు దొర శస్త్రచికిత్స జరిపారు. అనంతరం భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి, సోమవారం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యులను అభినందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌స్థాయి వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఈ శస్త్రచికిత్సే నిదర్శమని అన్నారు. బాధితుడికి సేవలందించి పాల్వంచ, భద్రాచలం ఆస్పత్రుల వైద్యులను, డీసీహెచ్ రవిబాబును అభినందించారు. భద్రాచలం ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ స్కాన్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం పాల్వంచ, భద్రాచలం వైద్యులను బాధితుడు బిశాల్ తమంగ్ దంపతులు శాలువాతో ఘనంగా సత్కరించారు. వైద్యాధికారులు రామ కృష్ణ, రాంప్రసాద్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి.పాటిల్.


