భారీగా గంజాయి సీజ్
మణుగూరు టౌన్: సీలేరు నుంచి స్టేషన్ ఘన్‌పూర్‌కు నిషేధిత గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను మణుగూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సీఐ నాగబాబు కథనం ప్రకారం.. పోలీసులు తోగ్గూడెం సమ్మక్క– సారలమ్మ ఆలయం సమీపంలో వాహనాల తనిఖీ చేపడుతున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి కారును తనిఖీ చేయగా రూ.16.10లక్షల విలువైన గంజాయి లభ్యమైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కి చెందిన మారుపాక యుగంధర్, మచ్చ క్రాంతికుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా విప్పల్‌రెడ్డిగూడేనికి చెందిన విజయ్‌భాస్కర్‌రెడ్డి సీలేరులోని చిత్రకొండకు చెందిన సుంద్రు సుందర్‌రావు వద్ద 33 కేజీల కొనుగోలు చేసి తరలిస్తుండగా, పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.


