చికిత్స పొందుతున్న యువకుడి మృతి
పాల్వంచరూరల్: యూటర్న్ తీసుకునే క్రమంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. మండల పరిధి జగన్నాధపురం గ్రామానికి చెందిన గుగులోతు కార్తీక్(24) ఈనెల 13న బీసీఎం జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో అదే సమయానికి అదే గ్రామానికి చెందిన చరణ్ ద్విచక్ర వాహనంపై ఎదురురావడంతో ఆ రెండు వాహనాలు ఢీకొన్నా యి. ఈక్రమంలో కార్తీక్ తలకు తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చరణ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
కారు ఏసీలో మంటలు..
● పూర్తిగా దగ్ధమైన కారు
టేకులపల్లి: కారు ఏసీలో మంటలు చెలరేగడంతో కారు మొత్తం దగ్ధమైంది. వివరాలిలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన లకావత్ కిషన్ మణుగూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం తన భార్య లక్ష్మితో కలిసి కామేపల్లి మండలం గోవింద్రాలలో జరుగుతున్న ఇరుముడి కార్యక్రమానికి కారులో వయా ఇల్లెందు టేకులపల్లి మీదుగా బయలుదేరారు. బొమ్మనపల్లి వద్దకు రాగానే ఏసీ ఆన్ చేసిన కొద్ది సేపటికే పొగలు రావడంతో గమనించి కారుకొండ క్రాస్‌రోడ్ తరువాత ఆపి చూడగా.. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ముఖ్యమైన పత్రాలను తీసుకున్నారు. కొత్తగూడెం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చే సరికి కారు మొత్తం మంటల్లో దగ్ధమైంది. అనంతరం బాధితులు టేకులపల్లి పోలీసు స్టేషన్‌లో రాతపూర్వకంగా తెలియజేశారు.
చికిత్స పొందుతున్న యువకుడి మృతి


