సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతాం..
చర్ల: మండలంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వార్డు అభ్యర్భుల ఓటమికి కారకులైన వారందరికీ సమయం వచ్చినప్పుడు సరైన రీతిలో బుద్ధి చెబుతామని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య హెచ్చరించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండలంలో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీని ఆదివారం చర్లలో నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షురాలు తోట దేవీప్రసన్నతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గెలిసే ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఇసుక మాఫియా తమ ధన బలాన్ని ప్రయోగించి కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని, వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం దేవీ ప్రసన్న మాట్లాడగా.. కార్యక్రమంలో చర్ల పంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, ఉప సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్పా శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ ఇర్పా శాంత, నాయకులు పాల్గొన్నారు.


