గిరిజన సంస్కృతిని ఆస్వాదించాలి
భద్రాచలంటౌన్: భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, పర్యాటకులు ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియాన్ని సందర్శించి గిరిజన సంస్కృతిని ఆస్వాదించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. రామాలయం సమీపాన ఉన్న మిథిలా స్టేడియం పక్కన ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం సమాచార బోర్డును ఆదివా రం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు వారి జీవనశైలిని ప్రతిబింబించేలా మ్యూజియంలో పెయింటింగ్స్, కళాఖండాలను పొందుపరిచామన్నారు. యాత్రికులు గిరిజన వారసత్వాన్ని ఆస్వాదించడంతో పాటు అక్కడ లభించే గిరిజన సంప్రదాయ వంటకాలను రుచి చూడాలని కోరారు. గిరిజన మ్యూజియం గొప్పతనాన్ని పర్యాటకులు తమ ప్రాంతాల్లో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్, డీఎస్‌ఓ ప్రభాకర్‌రావు, సిబ్బంది వంశీ, దినేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ బి.రాహుల్


