సింగరేణి మాజీ సీఎండీకి ఆత్మీయ వీడ్కోలు
రుద్రంపూర్: సింగరేణి సంస్థకు ఎనలేని సేవలందించిన మాజీ సీ అండ్ ఎండీ బలరామ్‌కు ఆదివారం ఇల్లెందు క్లబ్‌లో బీఎంఎస్ యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా యూనియన్ జాతీయ నాయకుడు మాదవ నాయక్ మాట్లాడుతూ.. 2018లో డైరెక్టర్ ఫైనాన్స్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థలో డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్, డైరెక్టర్ పా, డైరెక్టర్ ఆపరేషన్స్, సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంటి కీలక బాధ్యతలు చేపట్టి ఆయన సింగరేణిలో కార్మిక, కేంద్రిత పరిపాలనకు దిశా నిర్దేశం చేశారన్నారు. కార్మికులకు ప్రమాద బీమా, కోవిడ్ మహమ్మరి సమయాన వ్యాక్సినేషన్ ద్వారా కార్మికుల ప్రాణాలను కాపాడిన గొప్ప వ్యక్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు, కార్మికులు పాల్గొ న్నారు.


