
కనకగిరి గుట్టలపై కలెక్టర్
చండ్రుగొండ : విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ జితేష్ వి పాటిల్ తన తనయుడు రాఘవ్ వి పాటిల్‌తో కలిసి ఆదివారం కనకగిరి గుట్టలు ఎక్కారు. గుట్ట కింద నుంచి ఉదయమే కాలినడక వెళ్లి హస్తాల వీరన్నస్వామిని దర్శించుకున్నారు. అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా ప్రవహించే వాగు, చెక్‌డ్యాం వద్ద తనయుడితో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఈ ప్రాంతంలో ఉన్న చెట్లు, అహ్లాదపరిచే ప్రకృతిని కుమారుడికి వివరించారు. వారి వెంట దిశ కమిటీ సభ్యుడు బొర్రా సురేష్, నాయకులు భోజ్యానాయక్, నాగరాజు ఉన్నారు.