
ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందానికి అభినందన
ఖమ్మంక్రైం: పాల్వంచ మీదుగా అక్రమంగా తరలిస్తున్న మారణాయుధాలు, ఎండు గంజా యిని ఇటీవల చాకచక్యంగా స్వాధీనం చేసుకు న్న ఖమ్మం ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం అభినందించారు. హైదరాబాద్‌లో ఆబ్కారీ భవన్‌లో సోమవారం అభినందించిన ఆయన రూ. 50వేల క్యాష్ రివార్డ్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందంలో అసిస్టెంట్ కమిషనర్ ఏ.గణేష్, ఎకై ్సజ్ అధికారులు, ఉద్యోగులు ఎస్.రమేష్, సీహెచ్.శ్రీహరిరావు, ఎంఏ.కరీం, జి.బాలు, కె.సుధీర్, టి.వెంకట్, హరీష్, వి.హన్మంతరావు, పి.విజయ్, వీరబాబు, ఉపేందర్ తదితరులు ఉన్నారు.
ఇద్దరు
మావోయిస్టుల అరెస్టు
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం బస్టాండ్ సెంటర్‌లో కనిపించిన ఇద్దరు మావోయిస్టులను (దంపతులు) కొత్తగూడెం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో సోమవారం ఎస్పీ రోహిత్‌రాజు వివరాలు వెల్లడించారు. మావోయిస్టులు ఓయం భూదు, పోడియం రామేలను అరెస్టు చేశామని తెలిపారు. ఓయం భూదు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీసు స్టేషన్ పరిధి తుమ్మినార్ గ్రామానికి చెందిన ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించామని చెప్పారు. 2009లో మావోయిస్టు పార్టీలో చేరి 2014లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడని తెలిపారు. 2020లో పోలీసులపై కాల్పులు జరిపి ఎస్‌ఐ, పీసీలను హతమార్చిన ఘటనలో నిందితుడని వివరించారు. భూదు భార్య పొడియం రామే అలియాస్ శిల్ప 2018లో మావోయిస్టు పార్టీలో సభ్యురాలిగా పని చేస్తోందని తెలిపారు. రామే పై దాదాపు 60 కేసులు ఉన్నాయని చెప్పారు. కొంతకాలంగా మావోయిస్టు పార్టీపై తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో నిర్బంధం పెరగడంతో వివిధ ప్రాంతాలకు పారిపోతున్నారని, ఈ క్రమంలో వీరిద్దరినీ కొత్తగూడెం బస్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నామని వివరించారు.
కోళ్ల గూటిలోకి
తాచుపాము
కొత్తగూడెంఅర్బన్: తాచుపాము ఇంట్లోకి దూరడంతో స్థానికులు ఆందోళన చెందుతుండగా ప్రాణధార ట్రస్ట్ స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ సంతోష్ దాన్ని బంధించారు. కొత్తగూడెం న్యూగొల్లగూడెంలోని ఓ ఇంట్లో కోళ్ల గూటిలోకి సోమవారం ఐదు అడుగులు తాచుపాము చేరింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంతోష్ వెళ్లి దాన్ని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశాడు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందానికి అభినందన