
మెడికల్ కాలేజీకి భౌతికకాయం
కొత్తగూడెంఅర్బన్: వామపక్ష భావాలు కలిగిన సామాజిక కార్యకర్త నామా వెంకటేశ్వరరావు మణుగూరులో ఆదివారం మృతి చెందగా ఆయన భౌతికకాయాన్ని కుటుంబసభ్యులు సోమవారం కొత్తగూడెం మెడికల్ కాలేజీకి అప్పగించారు. అంతకుముందే మణుగూరులో ఆయన కళ్లను కూడా దానం చేశారు.
అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధం
టేకులపల్లి: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో రేకుల ఇల్లు దగ్ధమై, సామగ్రి పూర్తిగా కాలిపోయిన ఘటన మండలంలోని పెట్రాంచెలక గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈసం రఘుపతి – భద్రమ్మ దంపతులు, వారి కుమారుడు నవీన్ వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుంటారు. ఇంటి ముందు రేకుల షెడ్డులో ఆదివారం రాత్రి నిద్రించారు. దోమలు అధికం కావడంతో వేరే గదిలోకి వెళ్లి పడుకున్నారు. ఆ తర్వాత రాత్రి సుమారు 2 గంటల సమయంలో రేకుల షెడ్డులో మంటలు చెలరేగగా రఘుపతి, కుటుంబసభ్యులు బయటకు వచ్చారు. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పేసరికే పల్సర్ బైక్, మంచాలు, కూలర్, టార్పాలిన్ పట్టాలు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. రెవెన్యూ అధికారి సౌజన్య ఘటనా స్థలా నికి చేరుకుని పంచనామా నిర్వహించి వివరాలు నమోదు చేశారు. మొత్తంగా రూ.3లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని, ఏడాది క్రితం కూడా తమ పొలంలో నిప్పు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ఇద్దరు ఆర్టిజన్ల
కుటుంబాలకు పరిహారం
భద్రాచలంఅర్బన్: విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ 2023 ఆగస్టు 25న ప్రమాదవశాత్తు మరణించిన పినపాక ఆర్జిటన్ కొత్తపల్లి రమేష్, దుమ్ముగూడెం ఆర్జిటన్ తాటి కోటేశ్వరరావు కుటుంబాలకు ఎన్పీడీసీఎల్ నుంచి పరిహారం మంజూరైంది. ఈ మేరకు రమేష్ కుటుంబానికి రూ.12,03,500, కోటేశ్వరరావు కుటుంబానికి రూ.14,46,050 పరిహారం చెక్కులను సోమవారం భద్రాచలం డివిజనల్ ఇంజనీర్ కె.జీవన్‌కుమార్ అందజేశారు. అలాగే, రమేష్ కుటుంబానికి భద్రాచలం డివిజన్ విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. విదు్‌య్త్ శాఖ ఉద్యోగులు, యూనియన్ల నాయకులు పాల్గొన్నారు.

మెడికల్ కాలేజీకి భౌతికకాయం

మెడికల్ కాలేజీకి భౌతికకాయం