
ముత్తంగి అలంకరణలో రామయ్య
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
30న జిల్లాలో
సీఎం పర్యటన ?
దామరచర్లలో సభాస్థలిని
పరిశీలించిన ఎమ్మెల్యే జారే
చండ్రుగొండ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 30న జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మండలంలోని దామరచర్ల గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సభాస్ధలిని, చండ్రుగొండలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ను పరిశీలించారు. సీఎం పర్యటన దాదాపు ఖరారైనట్లు అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈనెల 21న బెండాలపాడులో సీఎం పర్యటించి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తారని ముందు ప్రకటించగా ఆ కార్యక్రమం వాయిదా పడిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ కుంగ్‌ఫూ పోటీల్లో పతకాలు
గుండాల/కొత్తగూడెంటౌన్ : హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన అంతర్జాతీయ కుంగ్ ఫు కరాటే పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు పతకాలు సాధించారు. గుండాలకు చెందిన మంకిడి చరణ్ తేజ్, గుగులోత్ గౌతమ్, సట్టు ఉదయ్‌కిరణ్ మూడు విభాగల్లో ప్రథమ స్థానం సాధించారు. అండర్–15 విభాగంలో జిల్లాకు చెందిన కె.లిఖిత్‌చరణ్ కటాస్‌లో బంగారు పతకం, అండర్–10లో బి. భానుకృష్ణ రజిత పతకం, అండర్–12 బాలికల విభాగంలో ఎ.ఆశ్రిత కటాస్‌లో బంగారు పతకం, అండర్–10 బాలికల విభాగం కటాస్‌లో ఎస్.షణ్ముఖశ్రీ కాంస్య పతకం సాధించారు. కాగా, విజేతలను అంతర్జాతీయ కరాటే మాజీ క్రీడాకారుడు పి.కాశీహుస్సేన్, కోచ్ నిహారిక, జిల్లా రెజ్లింగ్ అసోసియోషన్ గౌరవాధ్యక్షుడు నాగ సీతారాములు, జిల్లా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సాబీర్‌పాషా, జిల్లా కుంగ్‌ఫు కరాటే మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐ.ఆదినారాయణ తదితరులు అభినందించారు.
బీసీ సంక్షేమాధికారిగా విజయలక్ష్మి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా బీసీ సంక్షేమాధికారిగా పి.విజయలక్ష్మి సోమవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఇప్పటివరకు జిల్లాలో ఈ విధులు నిర్వహించిన ఇందిర భూపాలపల్లికి బదిలీ అయ్యారు. కాగా, విజయలక్ష్మి గతంలో బీసీ అభివృద్ధి అధికారిగా పని చేయగా, పదోన్నతి లభించింది.

ముత్తంగి అలంకరణలో రామయ్య

ముత్తంగి అలంకరణలో రామయ్య

ముత్తంగి అలంకరణలో రామయ్య