జోరుగా వన మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

జోరుగా వన మహోత్సవం

Aug 25 2025 8:36 AM | Updated on Aug 25 2025 8:36 AM

జోరుగ

జోరుగా వన మహోత్సవం

నెలాఖరు వరకు లక్ష్యాలు పూర్తి

జిల్లాలో లక్ష్యానికి చేరువలో కార్యక్రమం

ఈ ఏడాది 71.41 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం

ఇప్పటికే నాటిన మొక్కలు 80 శాతం

చుంచుపల్లి: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వన మహోత్సవం కార్యక్రమం జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం జిల్లాలో 71.41 లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. ఇందుకోసం గతేడాది అక్టోబర్‌ నుంచి జిల్లాలో 481 హరిత, మరో 32 అటవీ శాఖ నర్సరీల్లో 20 రకాల మొక్కలు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది జూలైలో వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈసారి కూడా జూలై రెండో వారం నుంచే గ్రామాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో పలు శాఖలు ముందు వరుసలో నిలవగా, కొన్ని శాఖలు మాత్రమే లక్ష్య సాధనలో కొంత వెనుకబడ్డాయి. ఆగస్టు మొదటి వారం నుంచి వన మహోత్సవం జోరందుకోవడంతో పలు శాఖలు లక్ష్యాలను చేరుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాది జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం సైతం తొందరగానే ముగియనుందని భావిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 80.20 శాతం అంటే.. 57.27 లక్షల మొక్కలు నాటారు. ఇంకా 1,41,4031 మొక్కలు నాటాల్సి ఉంది.

లక్ష్యానికి చేరువలో శాఖలు..

కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, పాల్వంచ, అశ్వారావుపేట మున్సిపాలిటీలతో పాటు జిల్లాలో 471 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో జూలై నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల వారీగా మొక్కలు పంపిణీ చేసి నాటించే లక్ష్యాలను కేటాయించారు. ఈసారి వన మహోత్సవ లక్ష్యసాధనలో డీఆర్‌డీఏ, అటవీశాఖ, టీజీఎఫ్‌డీసీ, ముందువరసలో నిలిచాయి. కొత్తగూడెం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో 130.27 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారు. డీఆర్‌డీఏ శాఖకు 30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా, 106.86 శాతంతో ఇప్పటి వరకు 32.05 లక్షల మొక్కలు నాటారు. టీజీఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో 12.90 లక్షల మొక్కలకు గాను 78.21 శాతంతో 10.08 లక్షల మొక్కలు నాటారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 37.72 శాతం, మణుగూరులో 22.95 శాతం మాత్రమే మొక్కలు నాటారు. ఇక సింగరేణి సంస్థ తమ పరిధిలోని ఏరియాల్లో 58.35 శాతంతో 1.92 లక్షల మొక్కలు నాటింది. వ్యవసాయ శాఖ సైతం 85.26 శాతంతో 4.26 లక్షల మొక్కలు నాటింది. పాఠశాల విద్యాశాఖ, సంక్షేమ, వైద్యారోగ్య, మార్కెటింగ్‌, సహకారశాఖ, విద్యుత్‌ శాఖలు నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటివరకు నాటిన 57.27 లక్షల మొక్కలకు గానూ 20.44 లక్షల మొక్కలకు అధికారులు జియో టాగింగ్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఇందులో ఒక్క డీఆర్‌డీఏకు చెందిన మొక్కలే అత్యధికంగా 14.32 లక్షల వరకు ఉన్నాయి. వన మహోత్సవంలో నాటుతున్న మొక్కలకు సంరక్షణ చర్యలను అటవీశాఖ చేపడుతోంది.

వనమహోత్సవలో భాగంగా ఈ ఏడాది జోరుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. జిల్లాలో అన్ని శాఖలు ఉత్సాహంగా ఈసారి వన మహోత్సవంలో పాల్గొంటున్నాయి. ఈ ఏడాది నిర్దేశించిన 71.41 లక్షల మొక్కల టార్గెట్‌లో ఇప్పటివరకు 57.27 లక్షల మొక్కలు నాటారు. భద్రాద్రిని హరిత జిల్లాగా తీర్చిదిద్దడమే అటవీ శాఖ ప్రధాన లక్ష్యం.

– కిష్టాగౌడ్‌, డీఎఫ్‌ఓ

జోరుగా వన మహోత్సవం1
1/1

జోరుగా వన మహోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement