
మనసుకు ధ్యానం..
● ప్రభుత్వ పాఠశాలల్లో సమగ్ర విద్యావిధానం ● విద్యార్థుల వికాసానికి కొత్త బాటలు ● నిత్యం యోగా, ధ్యానం, కథల పఠనం
మేధస్సుకు కథలు!
కరకగూడెం: పాఠశాల అంటే కేవలం పుస్తకాలు, పాఠాలు, పరీక్షలు మాత్రమేకాదు. అది మన శరీ రం, మనసు, ఆలోచనలను పెంపొందించే ఒక అద్భుతమైన ప్రదేశం. ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఐదు నిమిషాలు యోగా లేదా ధ్యానం, అరగంట సేపు కథలు, పత్రికల పఠనం చేయించాలని ఇటీవల సర్కారు ఆదేశాలు జారీచేసింది. ఉపాధ్యాయు లు ఈ ఆదేశాలను అమలు చేస్తూ పాఠశాల జీవి తాన్ని మరింత ఆసక్తికరంగా, ఉత్తేజకరంగా మా ర్చుతున్నారు.
శారీరక, మానసిక ఆరోగ్యానికి సోపానం..
ప్రతిరోజూ ఐదునిమిషాల పాటు యోగా లేదా ధ్యానం ద్వారా విద్యార్థులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. యోగా సనాలు విద్యార్థుల శరీర సమతుల్యత, బలాన్ని మెరుగుపరుస్తాయి. ఇది శారీరక దృఢత్వాన్ని పెంచి భంగిమ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ధ్యానం, శ్వాస, వ్యాయామాలు విద్యార్థుల్లో ఒత్తిడి, ఆందోళన తగ్గించి మానసిక ప్రశాంతత చేకూరుస్తాయి. భావోద్వేగాల నియంత్రణ, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది.
నైతిక విలువలు, జ్ఞానం
ప్రభుత్వం రూపొందించిన అకడమిక్ క్యాలెండర్‌లో విద్యార్థులు రోజూ అరగంట పాటు కథల పుస్తకాలు, పత్రికలు చదవాలని సూచించారు. కథల పుస్తకాలు చదవడం ద్వారా విద్యార్థులు నైతిక విలు వలు నేర్చుకుంటారు. ఇవి వారిలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడమే కాక సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా మార్చడానికి దోహదపడతాయి. పత్రికలు చదవడం వల్ల విద్యార్థులకు వర్తమాన విషయాలపై అవగాహన పెరిగి సాధారణ జ్ఞానాన్ని బలోపేతం చేస్తుంది. భాషా నైపుణ్యాలు, పదజాలం, సృజనాత్మక ఆలోచనలు మెరుగుపడతాయి. విద్యార్థుల్లో ఊహాశక్తి, సృజనాత్మకత పెరిగి కొత్త ఆలోచనలు, వినూత్న భావనలకు దారితీస్తాయి.
కట్టుదిట్టమైన అనుసరణ..
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఉదయం ప్రార్థన సమయంలో లేదా తరగతి గదుల్లో యోగా, ధ్యానం సెషన్లు నిర్వహిస్తున్నారు. అలాగే కథల పుస్తకాలు, పత్రికలను విద్యార్థులకు అందుబాటులో ఉంచి చదివేలా ప్రోత్సహిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమాలను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ఉపాధ్యాయులు వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు.

మనసుకు ధ్యానం..