
సమాచారం అడిగే హక్కు అందరికీ ఉంది
ఖమ్మం సహకారనగర్ : సమాచారం అనేది వజ్రాయుధమని, అవసరమైన సమాచారాన్ని సేకరించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ పి.వి. శ్రీనివాస్ అన్నారు. నగరంలోని ఐఎంఏ హాల్‌లో శనివారం ఏర్పాటు చేసిన స.హ.చట్టం అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సమాచార హక్కును దుర్వినియోగం చేయొద్దని, దీన్ని అడ్డుపెట్టుకుని కొందరు ప్రలోభాలకు గురిచేస్తూ అడ్డదారులు ఎంచుకోవడం సరైంది కాదని హెచ్చరించారు. ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం–2005కు అనుగుణంగా కోరిన వారికి సకాలంలో సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అప్పిలేట్ అధికా రిపై ఉంటుందని అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేసే వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు కంభంపాటి నారాయణరావు, జగదీష్, న్యాయవాది తిరుమలరావు, ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు, డాక్టర్ సుబ్బారావు, శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా కార్యదర్శి చిర్రా రవి, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
స.హ. చట్టం కమిషనర్ పి.వి.శ్రీనివాస్