అనారోగ్యంతో వీఆర్‌ఏ మృతి | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో వీఆర్‌ఏ మృతి

Aug 10 2025 5:54 AM | Updated on Aug 10 2025 5:54 AM

అనారో

అనారోగ్యంతో వీఆర్‌ఏ మృతి

జూలూరుపాడు: మండలంలోని కాకర్ల వీఆర్‌ఏ ఖాసీం(73) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఖాసీంకు భార్య జయతున్నీషా బేగం, ఎనిమిది కూతుర్లు ఉన్నారు.

పురుగుల మందు తాగిన వ్యక్తి మృతి

ఇల్లెందురూరల్‌: మండలంలోని హనుమంతులపాడు గ్రామానికి చెందిన కోరం సంతోష్‌కుమార్‌ (28) రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. ఖమ్మం ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య తేజశ్రీ ఫిర్యాదు మేరకు ఇల్లెందు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

దుమ్ముగూడెం: మండలంలోని తురుబాక గ్రామానికి చెందిన యువకుడు, బూర్గంపాడు మండలానికి చెందిన యువతి ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కోసం శనివారం దుమ్ముగూడెం పోలీసులను ఆశ్రయించారు. కొంత కాలంగా ప్రేమించుకుంటున్న వీరి వివాహానికి యువతి తల్లితండ్రులు ఒప్పుకోకపోవడంతో ప్రేమజంట రహస్యంగా వివాహం చేసుకుంది. రక్షణ కోసం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇద్దరు మేజర్ల కావడంతో వివాహం చేసుకున్నారని నచ్చజెప్పారు.

32 కేజీల గంజాయి స్వాధీనం

మణుగూరు టౌన్‌: ఒడిశా నుంచి వరంగల్‌కు తరలిస్తున్న గంజాయిని శనివా రం మణుగూరు పోలీసులు పట్టుకున్నారు. సీఐ పాటి నాగబాబు కథనం ప్రకా రం.. ఎస్‌ఐ రంజిత్‌, సిబ్బందితో కలిసి తోగ్గూడెం శివారు ప్రాంతంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను ఆపి తనిఖీ చేయగా 32 కేజీల గంజాయి లభించింది. విచారించగా అల్లూరి సీతారామరాజు జిల్లా పెద్దపాక మండలం కుసున్నపల్లి గ్రామానికి చెందిన తోడెం శ్రీను, మహబూబాద్‌ జిల్లా బోడగుట్ట తండా గ్రామానికి చెందిన బానోత్‌ కుమార్‌ ఆటోలో గంజాయి తరలిస్తున్నట్లు తేలింది. గంజాయి విలువ రూ.16 లక్షలు ఉంటుందని అంచనా. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కి తరలించినట్లు సీఐ తెలిపారు.

పోగొట్టుకున్న పర్సు అప్పగింత

అశ్వారావుపేటరూరల్‌: దుకాణం వద్ద మరిచిపోయిన బంగారు ఆభరణాల పర్సును పండ్ల వ్యాపారి దంపతులు తిరిగి బాధిత మహిళకు అప్పగించారు. ఈ ఘటన శనివా రం జరిగింది. ఏపీలోని ఏలూ రు జిల్లా కుక్కునూరు మండలం అల్లిగూడెం గ్రామానికి చెందిన ఓ మహిళ అశ్వారావుపేటలోని ఓ జ్యూయలరీ షాపులో రూ.లక్షా 50 వేల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేసింది. తిరిగి వెళ్తున్న క్రమంలో ఆసుపాక శివారులో బిర్రం నరేష్‌, ప్రత్యూష దంపతుల దుకాణం వద్ద ఆగి డ్రాగన్‌ పండ్లను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో ఆభరణాల పర్సును అక్కడే పెట్టి ఆటోలో వెళ్లిపోయింది. గమనించిన పండ్ల వ్యాపారి గమనించి భద్రపరిచాడు. మూడు గంటల తర్వాత పర్స్‌ పోగొట్టుకున్నట్లు గుర్తించిన మహిళ తిరిగి వెతుక్కుంటూ వచ్చింది. నరేష్‌ దంపతులు ఆభరణాల పర్సు అందజేసి నిజాయితీ చాటుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపారి దంపతులను పలువురు అభినందించారు.

ట్రాన్స్‌ఫార్మర్ల దొంగల అరెస్ట్‌

పినపాక: రైతుల పంట పొలా ల్లో ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, వాటిలోని రాగిని అమ్ముకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠా ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ముఠా సభ్యులు ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగిని తీసుకుని హైదరా బాద్‌, పాల్వంచలోని స్క్రాప్‌ షాపుల్లో విక్రయిస్తున్నట్లు తేలిందని మణుగూరు డీఎస్పీ వంగా రవీందర్‌ రెడ్డి తెలిపారు. వారి నుంచి 258 కేజీల రాగి, కారు, స్కూటీ, ఐదు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. కేసు ఛేదించిన సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై సురేష్‌లను డీఎస్పీ అభినందించారు.

పర్సులో రూ.1.50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు

అనారోగ్యంతో వీఆర్‌ఏ మృతి1
1/3

అనారోగ్యంతో వీఆర్‌ఏ మృతి

అనారోగ్యంతో వీఆర్‌ఏ మృతి2
2/3

అనారోగ్యంతో వీఆర్‌ఏ మృతి

అనారోగ్యంతో వీఆర్‌ఏ మృతి3
3/3

అనారోగ్యంతో వీఆర్‌ఏ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement