
ముగ్గురిపై కేసు నమోదు
పాల్వంచరూరల్: చందాల విషయంలో జరిగిన ఘర్షణ ఘటనలో పోలీసులు ముగ్గురిపై శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సంగం గ్రామానికి చెందిన పలువురు కలిసి వన దేవత కోసం గ్రామంలో చందాలు వసూలు చేశారు. లెక్కల విషయమై బొర్రెం ఏసుతో ఈ నెల 5న ఇంజమూరి సాయి, నక్కూరి సాయిదుర్గాప్రసాద్, శంఖు ప్రణయ్‌లు గొడవ పడి దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
లారీ – బొలే రో
వాహనం ఢీ
ఇద్దరికి తీవ్ర గాయాలు
తిరుమలాయపాలెం: బొలే రో వాహనం లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం తెల్లవారుజామున దమ్మాయిగూడెం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి పూల మొక్కల లోడుతో నిర్మల్ వెళ్తున్న బొలే రోను వాహనం దమ్మాయిగూడెం సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే మరిపెడ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో బొలే రో వాహనం డ్రైవర్ ఆకుల లోవరాజు, తోడుగా వచ్చిన బొడ్డుపల్లి ప్రదీప్‌కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దాడి ఘటనలో కేసు నమోదు
చింతకాని: మండల పరిధిలోని రామకృష్ణాపు రం గ్రామానికి శ్రీలం సుదర్శన్‌రావు, అతడి కుమారుడు చైతన్యపై దాడి చేసిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగుల్ మీరా తెలిపారు. వివరాలిలా ఉన్నా యి.. సుదర్శన్‌రావు కుటుంబసభ్యులకు సంబంధించిన భూ వివాదంపై ఈనెల 6న తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. గ్రామానికి చెందిన మాలెంపు కోటేశ్వరరావు, వారి కుటుంబసభ్యులు ఈ వివాదంలో జోక్యం చేసకోగా ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సుదర్శన్‌రావు, అతడి కుమారుడిపై దాడి చేసిన ఘటనలో కోటేశ్వరరావుతో పాటు విజయ, పద్మావతిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
వేంసూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. స్థానికుల కధనం ప్రకారం.. రామన్నపాలెం ఎస్సీ కాలనీకి చెందిన కొత్తపల్లి గోపీకిరణ్(20) భీరపల్లి శివారున ఉన్న పెట్రోల్ బంక్‌లో నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా మొద్దులగూడెం వైపు వెళ్తున్న కారు డీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన గోపీకిరణ్‌ను చికిత్స నిమిత్తం సత్తుపల్లికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

ముగ్గురిపై కేసు నమోదు