
ఆదివాసీలకు తోడ్పాటు : ఎస్పీ
కొత్తగూడెంటౌన్: ఆదివాసీ ప్రజలు అన్ని రంగా ల్లో రాణించేలా తోడ్పాటునందిస్తామని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. శనివారం కొత్తగూడెం పో లీస్ డివిజన్‌ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినో త్సవం ఘనంగా నిర్వహించారు. రైల్వేస్టేషన్ వద్ద ర్యాలీని ఎస్పీ రోహిత్‌రాజు ప్రారంభించారు. బస్టాండ్ సెంటర్ మీదుగా కొత్తగూడెం క్లబ్ వర కు ర్యాలీ కొనసాగింది. కొత్తగూడెం క్లబ్‌లో ఎస్పీతోపాటు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ కనకమ్మ తదితరులు ఆదివాసీ నేతలు కొమరంభీమ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆదివాసీల కోసం పోలీసుశాఖ తరఫున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు విద్యా, వైద్యం, రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తున్నామని అన్నా రు. యువత కోసం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను నిర్మి స్తున్నామని, ఉద్యోగ అవకాశాలకోసం శిక్షణ ఇప్పిస్తున్నామని వివరించారు. రెండు మొబైల్ ఆస్పత్రులు, మూడు గ్రంథాలయాలు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆదివాసీ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. సీఐలు శ్రీనివాస్, కరుణాకర్, శివప్రసాద్, ప్రతాప్, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.