పీఆర్‌పీ కోసం ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పీఆర్‌పీ కోసం ఆందోళన

Aug 13 2025 5:34 AM | Updated on Aug 13 2025 5:34 AM

పీఆర్

పీఆర్‌పీ కోసం ఆందోళన

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థ 2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో అధికారులకు చెల్లించాల్సిన పర్ఫామెన్స్‌ రిలేటెడ్‌ పే (పీఆర్‌పీ) చెల్లించటం లేదని, సింగరేణివ్యాప్తంగా ఉన్న సుమారు 2,300 మంది అధికారులు మంగళవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం, ఏరి యా జీఎం కార్యాలయం, వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఎంఓఏఐ సెక్రటరీ కేశవరావు మాట్లాడారు. ఆరు నెలల నుంచి తమకు రావాల్సిన పీఆర్‌పీ చెల్లించాలని డిప్యూటీ సీఎం, భట్టివిక్రమార్క, కోల్‌బెల్ట్‌ ఎమ్మెల్యేలకు పలుమార్లు వినతిపత్రాలు అందించినప్పటికీ ఎవరూ స్పందించలేదని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రెండు నెలల్లో

బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు

ఇల్లెందు: జిల్లావ్యాప్తంగా రాబోయే రెండు నెలల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని బీఎస్‌ఎన్‌ఎల్‌ డీజీఎం రాజశేఖర్‌బాబు, ఏజీఎం కె.శ్రీనివాస్‌ వెల్లడించారు. మంగళవారం ఇల్లెందు మండలం కొమరారంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌లో తలెత్తిన సమస్యను పరిష్కరించేందుకు గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఇల్లెందులోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యా లయంలో విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 440 బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లు ఉన్నాయని, త్వరలోనే అన్నింటి నుంచి 5జీ సిగ్నల్‌ అందిస్తామని, ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ లో ఒక్క రుపాయికే సిమ్‌ అందజేస్తున్నామని, కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. ఈ సిమ్‌ పొందిన వారికి మొదటి నెల రీచార్జ్‌ ఉచితమని, అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌, ప్రతీ రోజు 2 జీబీ డేటా, 30 రోజుల్లో 100 ఎస్‌ఎంఎస్‌లు ఫ్రీ ఉంటాయని, ఈ ప్లాన్‌ ఈ నెలాఖరు వరకేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇల్లెందులో పలువురికి ఒక్క రూపాయి సిమ్‌ను అందజేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు మనీశ్‌జైన్‌, బాలాజీ, భరత్‌రెడ్డి, స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

బెటాలియన్‌, పోలీసుల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

భద్రాచలంఅర్బన్‌: హర్‌ఘర్‌ తిరంగాలో భాగంగా సీఆర్పీఎఫ్‌–141 బెటాలియన్‌, భద్రాచలం టౌన్‌ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం బైక్‌ర్యాలీ నిర్వహించారు. ద్విచక్రవాహనాలకు జాతీయజెండాలు కట్టుకుని, సీఆర్పీఎఫ్‌–141 బెటాలియన్‌ నుంచి చర్ల రోడ్డు, అంబేడ్కర్‌ సెంటర్‌, బ్రిడ్జి పాయింట్‌ నుంచి సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బెటాలియన్‌ కమాండెంట్‌ రితేశ్‌ఠాకూర్‌, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్‌, బెటాలియన్‌ కమాండెంట్లు రాజేశ్‌యాదవ్‌, ప్రీత, డిప్యూటీ కమాండెంట్‌ పత్రాస్‌పుర్తి, డాక్టర్‌ విజయ్‌కిశోర్‌రెడ్డి, భద్రాచలం టౌన్‌ సీఐ నాగరాజు, ఎస్‌ఐ స్వప్న తదితరులు పాల్గొన్నారు.

హెచ్‌పీఎస్‌లో

ప్రవేశాలకు డ్రా

భద్రాచలం: బేగంపేట, రామంతపూర్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూళ్లలో విద్యార్థుల ఎంపికకు భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం లాటరీ తీశారు. గిరిజనుల్లో కోయలకు మూడు, లంబాడీలకు రెండు, మిగిలిన కులాల వారికి ఒక సీటు కేటాయించగా ఇతర కులాల నుంచి దరఖాస్తులు అందలేదు. ఈ మేరకు తల్లిదండ్రులు, విద్యార్థుల సమక్షాన డ్రా తీయించి ఎంపిక చేశామని పీఎంఆర్‌సీ ఏసీఎంఓ రమేశ్‌ తెలిపారు. కాగా, ఎంపికై న వారు సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోతే వెయిటింగ్‌ జాబితాలో ఉన్న సీట్లు కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కొత్తపల్లి పీజీ హెచ్‌ఎం నర్సింహారావు, ఉద్యోగులు ప్రమీలబాయ్‌, రామకృష్ణారెడ్డి, రంగయ్య, మణికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పీఆర్‌పీ కోసం ఆందోళన1
1/2

పీఆర్‌పీ కోసం ఆందోళన

పీఆర్‌పీ కోసం ఆందోళన2
2/2

పీఆర్‌పీ కోసం ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement